Tue Jan 20 2026 18:15:44 GMT+0000 (Coordinated Universal Time)
సీఎం కేసీఆర్ కు పుష్పగుచ్ఛం పంపిన గవర్నర్ తమిళి సై
ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలంటూ.. ఆయన అభిమానులు, పార్టీ నేతలు, కార్యకర్తలు ఆకాంక్షిస్తున్నారు. తాజాగా గవర్నర్..

హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ నిన్న స్వల్ప అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. నిన్న ఉదయం యాదాద్రి పర్యటనకు వెళ్లాల్సిన సీఎం కేసీఆర్.. అస్వస్థతకు గురికావడంతో యశోద ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ వైద్యులు ఆయనకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి.. ఆయన ఆరోగ్యం బాగానే ఉంది కానీ.. కాస్త వీక్ గా ఉన్నారని తెలిపారు. సీఎం కు వారంరోజుల పాటు విశ్రాంతి అవసరమని యశోద వైద్యులు సూచించారు.
ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలంటూ.. ఆయన అభిమానులు, పార్టీ నేతలు, కార్యకర్తలు ఆకాంక్షిస్తున్నారు. తాజాగా గవర్నర్ తమిళి సై కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆయనకు పుష్పగుచ్ఛం పంపించారు. కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ప్రార్థిస్తున్నట్లు పుష్పగుచ్ఛంతో పాటు పంపిన లేఖలో పేర్కొన్నారామె. అనారోగ్య సమస్యలతో కేసీఆర్ ఆసుపత్రికి వెళ్లారని తెలిసి ఆందోళనకు గురయ్యానని చెప్పారు.
Next Story

