Tue Mar 17 2026 17:13:31 GMT+0530 (India Standard Time)
మోదీని కలిసిన గవర్నర్ తమిళి సై
తెలంగాణ గవర్నర్ తమిళి సై ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఢిల్లీకి చేరుకున్న గవర్నర్ ఈరోజు పార్లమెంటు కు వెళ్లారు

తెలంగాణ గవర్నర్ తమిళి సై ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఢిల్లీకి చేరుకున్న గవర్నర్ ఈరోజు పార్లమెంటు కు వెళ్లారు. అక్కడ ప్రధాని నరేంద్ర మోదీని కలిసి కొద్దిసేపు ముచ్చటించారు. తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను తమిళి సై సౌందర్ రాజన్ మోదీకి వివరించినట్లు తెలిసింది.
షాతో కూడా.....
కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా గవర్నర్ తమిళి సై కలవన్నారు. గవర్నర్ విషయంలో ప్రొటోకాల్ ఉల్లంఘనపై అమిత్ షా కు తమిళి సై ఫిర్యాదు చేయనున్నారు. తాను త్వరలో రాజ్ భవన్ లో ఏర్పాటు చేయనున్న ప్రజాదర్బార్ పై కూడా తమిళి సై అమిత్ షాకు వివరించనున్నారు.
Next Story

