Sat Mar 07 2026 13:38:05 GMT+0530 (India Standard Time)
Telangana : నేటి నుంచి బాధితుల ఖాతాల్లో పది వేలు
తెలంగాణలో వరద బాధితులకు ప్రకటించిన సాయాన్ని ప్రభుత్వం నేటి నుంచి జమ చేయనుంది.

తెలంగాణలో వరద బాధితులకు ప్రకటించిన సాయాన్ని ప్రభుత్వం నేటి నుంచి జమ చేయనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం వరదల్లో దెబ్బతిన్న కుటుంబాలకు పది వేల రూపాయల ఆర్థిక సాయాన్ని నేటి నుంచి లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.
వరద బాధితులకు...
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మున్నేరు నది ఉప్పొంగడంతో ఖమ్మం జిల్లాలోనూ, మహబూబాబాద్ జిల్లాలోనూ అనేక మంది నిరాశ్రయులయ్యారు. వారు నేటికీ కోలుకోలేక అవస్థలు పడుతున్నారు. అయితే బాధితుల సంఖ్య తేల్చడానికి, ఎవరెవరికి నష్టం జరిగిందన్న దానిపై అధికారులు నివేదికలు తయారు చేయడంతో నేటి నుంచి పది వేల రూపాయలు పంపిణీ చేయనున్నారు.
Next Story

