Fri Mar 20 2026 15:56:48 GMT+0530 (India Standard Time)
ఆది శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు.. రాష్ట్రంలో గొడవలు రేపేందుకు బీఆర్ఎస్
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ అరెస్టయితే రాష్ట్ర వ్యాప్తంగా గొడవలు చేయడానికి కుట్ర పన్నిందని ఆరోపించారు

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ అరెస్టయితే రాష్ట్ర వ్యాప్తంగా గొడవలు చేయడానికి బీఆర్ఎస్ కుట్ర పన్నిందని ఆరోపించారు. ఇందుకోసం నియోజకవర్గానికి బీఆర్ఎస్ నేతలు కోటి రూపాయల వరకూ కేటాయించినట్లు తమకు తెలిసిందన్నారు. ఫార్ములా ఈ రేసు లో కేటీఆర్ పై కేసు నమోదు అయిన వెంటనే ఈ డబ్బులు నియోజకవర్గానికి చేరినట్లు తమకు సమాచారం అందిందని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలన్న ఉద్దేశ్యంతో బీఆర్ఎస్ నాయకత్వం ఉందన్నారు.
నియోజకవర్గానికి కోటి...
బావ కళ్లల్లో ఆనందం కోసం హరీశ్ రావు అసెంబ్లీలో స్పీకర్ పై దాడికి తమ సభ్యులను ఉసి గొల్పారని ఆది శ్రీనివాస్ ఆరోపించారు. అవినీతి చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవద్దా? అని ఆయన ప్రశ్నించారు. చట్టపరంగా చర్యలు తీసుకుంటే చట్ట విరుద్ధంగా హింసకు దిగాలని ప్రయత్నించడం ఎంతవరకూ సబబని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. ఏ1 ముద్దాయిని అరెస్ట్ చేయాలా? వద్దా? అని ఆయన అన్నారు. కేటీఆర్ బినామీ, ఆయన ఆత్మలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కు విఘాతం కలిగించాలని, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈకుట్రలను పోలీసులు తిప్పికొట్టాలని ఆయన కోరారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story

