Thu Apr 09 2026 17:50:51 GMT+0530 (India Standard Time)
Telangana : తెలంగాణలో ఐఏఎస్ ల బదిలీ
తెలంగాణలో కొందరు ఐఏఎస్ లను బదిలీలు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది

తెలంగాణలో కొందరు ఐఏఎస్ లను బదిలీలు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ను మూడు కార్పొరేషన్లుగా విభజించింది. మూడు కార్పొరేషన్లకు కమిషనర్లుగా ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం నియయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మల్కాజ్ గిరి మున్సిపల్ కమిషనర్ గా వినయ్ కృష్ణారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా కర్ణన్ ను కొనసాగించాలని నిర్ణయించింది.
మున్సిపల్ కమిషనర్లుగా...
సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ గా సృజనను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సింగరేణి సీఎండీగా జ్యోతి బుద్ధ ప్రకాష్ ను నియమిస్తూ ప్రభుత్వం నియామకం చేపట్టింది. కేవలం హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన కార్పొరేషన్లకు కమిషనర్లను, సింగరేణి సీఎండీ నియామకం మాత్రమే ప్రభుత్వం చేపడుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
Next Story

