Thu Jan 01 2026 07:45:54 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నేడు ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్
నీటి పారుదల శాఖ రంగంపై ప్రభుత్వం ఈరోజు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ను ప్రభుత్వం ఇవ్వనుంది.

నీటి పారుదల శాఖ రంగంపై ప్రభుత్వం ఈరోజు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ను ప్రభుత్వం ఇవ్వనుంది. ఈ రోజు సాయంత్రం ప్రజాభవన్ లో ఈ కార్యక్రమం జరగనుంది. నీటిపారుదల శాఖ రంగంలో ప్రాజెక్టులు, నీటి కేటాయింపులపై సవివరంగా ఈ ప్రెజెంటేషన్ లో తెలియజేయనున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ను ఇవ్వనున్నారు.
ప్రజావేదికలో...
ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల నేతలు, అధికార ప్రతినిధులు కూడా హాజరు కానున్నారు. నీటిపారుదల రంగంపై అవగాహన కల్పించడం కోసం ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో నీటి పంపకాలపై ఈ అవగాహన కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
Next Story

