Sat Dec 13 2025 22:43:20 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : తెలంగాణలో 32 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ
తెలంగాణలో 32 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

తెలంగాణలో 32 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదనపు డీజీగా జయేంద్రసింగ్ చౌహాన్ ను నియమించింది.సీఐడీ డీజీగా పరిమళా నూతన్, పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా చేతన్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మహేశ్వరం డీసీపీగా నారాయణ్‌రెడ్డి,తెలంగాణ నార్కోటిక్ ఎస్పీగా పద్మజ, నాగర్‌కర్నూల్ ఎస్పీగా సంగ్రామ్‌సింగ్, సౌత్‌జోన్ డీపీసీగా కిరణ్ కారే ను నియమించింది. మహబూబాబాద్ ఎస్పీగా శబరీష్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
టాస్క్ ఫోర్స్ ఎస్పీగా...
ఆసిఫాబాద్ ఎస్పీగా నిఖితాపంత్, వికారాబాద్ ఎస్పీగా స్నేహ మిశ్రా, హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ ఎస్పీగా వైభవ్‌గైక్వాడ్, ములుగు ఎస్పీగా సుధీర్ లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భూపాలపల్లి ఎస్పీగా సంకేత్, వనపర్తి ఎస్పీగా సునీతలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 32 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉతర్వులు జారీ చేయడంతో ఇంకా మరికొద్ది రోజుల్లో ఐఏఎస్ అధికారుల బదిలీలను కూడా చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది.
Next Story

