Wed Mar 18 2026 20:04:25 GMT+0530 (India Standard Time)
Telangana : ప్రజాపాలన హామీల అమలుకు కేబినెట్ సబ్ కమిటీ
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాపాలన హామీల అమలు కోసం ప్రత్యేకంగా మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది

రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాపాలన హామీల అమలు కోసం ప్రత్యేకంగా మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. కేబినెట్ సబ్ కమిటీ ఛైర్మన్ గా మల్లు భట్టి విక్రమార్కను కమిటీ సభ్యులుగా శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని నియమించారు. ప్రజాపాలన హామీలను అమలు చేసేందుకు రేపటి నుంచే ఈ కమిటీ పనిచేయనుంది.
ఇచ్చిన హామీలను...
ప్రజా పాలన సందర్భంగా అనేక దరఖాస్తులు ప్రజల నుంచి వచ్చాయి. దీంతో పాటు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల అమలు కోసం కూడా అర్హులైన లబ్దిదారుల ఎంపిక కోసం గ్రామ సభలను నిర్వహించారు. కోట్ల సంఖ్యలో దరఖాస్తులు అందాయి. వీటిని పరిష్కరించడంతో పాటు హామీలను అమలు చేసేందుకు ఈ కమిటీ పనిచేస్తుంది.
Next Story

