Fri Dec 05 2025 15:19:26 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : ఇద్దరు ఐపీఎస్ లను రిలీవ్ చేసిన ప్రభుత్వం
తెలంగాణలో పనిచేస్తున్న ఇద్దరు ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం రిలీవ్ చేసింది.

తెలంగాణలో పనిచేస్తున్న ఇద్దరు ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం రిలీవ్ చేసింది. ఏపీ క్యాడర్ కు చెందిన అంజనీ కుమార్, అభిలాష బిస్తను ప్రభుత్వం రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర హోం శాఖ మొత్తం ముగ్గురు ఐపీఎస్ అధికారులను రిలీవ్ చేయాలని, ఇరవై నాలుగు గంటల్లో ఏపీలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఇద్దరిని పంపుతూ...
రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన అధికారులు కొన్నాళ్ల నుంచి తెలంగాణాలోనే పనిచేస్తున్నారు. డీజీ ర్యాంక్ లో అంజనీకుమార్ రోడ్ సేఫ్టే డీజీగా పనిచేస్తున్నారు. పోలీస్ ట్రైనింగ్ డీజీగా అభిలాష్ బిస్తా, ఎస్సీ ర్యాంక్ లో అభిషేక్ మహంతి కరీంనగర్ పోలీస్ కమిషనర్ గా పనిచేస్తున్నారు. అయితే ఇందులో ఇద్దరిని మాత్రమే తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేసింది. ఎన్నికలకోడ్ అమలులో ఉన్నందున ఏంచేయాలన్న దానిపై అభిషేక్ మహంతి విషయలో మాత్రం రిలీవ్ ఉత్తర్వులు విడుదల చేయలేదు.
Next Story

