Fri Dec 05 2025 22:15:44 GMT+0000 (Coordinated Universal Time)
ఇక తెలంగాణలో 24X7 షాపింగ్
తెలంగాణలో వ్యాపారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 24X7 షాపులు తెరిచి ఉంచే వీలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది

తెలంగాణలో వ్యాపారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై 24X7 షాపులు తెరిచి వ్యాపారం చేసుకునే వీలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1988 కు ప్రభుత్వం సవరణ చేసి ఈ వెసులుబాటు కనిపించింది. ప్రజలు ఇరవై నాలుగు గంటలూ షాపింగ్ చేసుకునే విధంగా షాపింగ్ మాల్స్ కూడా తెరిచి ఉంచుకోవచ్చని తెలిపాింది.
ప్రత్యేక ఉత్తర్వులు...
అయితే 24 గంటలు షాపింగ్ కోసం కొన్ని ఆంక్షలను విధించింది. షాపుకు ఏడాదికి పదివేల రూపాయలు అదనపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పోలీసు నిబంధనలకు అనుగుణంగా ఈ దుకాణాలు తెరిచి ఉంచాలని కూడా ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ జీవో నెంబరు 4 ద్వారా ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
Next Story

