Sun Mar 15 2026 13:39:26 GMT+0530 (India Standard Time)
తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. ఇన్ని నోటిఫికేషన్లా?
తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వరసగా నోటిఫికేషన్లను విడుదల చేస్తున్నారు

తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగాల జాతర కొనసాగుతుంది. వరసగా నోటిఫికేషన్లను విడుదల చేస్తున్నారు. తాజాగా మరో మూడు నోటిఫికేషన్లను ప్రభుత్వం విడుదల చేసింది. కాలేజీయేట్ ఎడ్యుకేషన్ లో 544 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. వచ్చే ఏడాది జనవరి 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 20వ తేదీ వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారు.
మూడు శాఖల్లో...
మున్సిపల్ శాఖలో కొత్తగా 78 పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదలయింది. జనవరి 28వ తేదీ నుంచి ఫిబ్రవరి 11వ తేదీ వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇంటర్మీడియట్, సాంకేతిక విద్యలో కూడా 71 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలయింది. జనవరి 21వతేదీ నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకూ దరఖాస్తులను స్వీకరిస్తారు. నిరుద్యోగులందరికీ కొత్త సంవత్సరం గుడ్ న్యూస్ చెబుతూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Next Story

