Sun Nov 03 2024 12:17:44 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : తెలంగాణ పోలీసులకు గుడ్ న్యూస్... దీవాలి గిఫ్ట్
తెలంగాణ పోలీసులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది
తెలంగాణ పోలీసులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పోలీసు సిబ్బందికి సరెండర్ లీవ్ లు చెల్లించేందుకు నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. పోలీసలుకు సరెండర్ లీవ్ ల మొత్తం దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉంది. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లగా ఈ నిధులను విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు182 కోట్ల రూపాయలను పోలీసు సిబ్బంది సరెండర్ లీవ్ ల కోసం తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది.
నిధులు విడుదల...
ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేయడంతో పోలీసు సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న బకాయీలను దీపావళికి ముందు ఇవ్వడంతో సంతోషంగా ఉన్నామంటూ పోలీసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన బకాయీలను కూడా దశలవారీగా విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
Next Story