Fri Dec 05 2025 13:41:52 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : నాలుగురోజుల పాటు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
నాలుగు రోజులు ప్రభుత్వ పాఠశాలలు, విద్యాకార్యాలయాలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది

నాలుగు రోజులు ప్రభుత్వ పాఠశాలలు, విద్యాకార్యాలయాలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. మేడారం జాతరకు ఈ సెలవులను ప్రకటిస్తూ ప్రభుత్వ ఉత్వర్వులు జారీ చేసింది. మేడారం జాతర రేపటి నుంచి ప్రారంభమవుతుంది. జిల్లాలో నాలుగు రోజులు పాటు సెలవులను ప్రకటిస్తూ కలెక్టర్ ములుగు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు ఉత్తర్వులు జారీ చేశారు. 21, 22, 23, 24 తేదీలలో ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయవని తెలిపింది. ఈ నాలుగు రోజులు విద్యాసంస్థలను మూసి వేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
ఏర్పాట్లు పూర్తి...
మేడారంలో అతి పెద్ద గిరిజన జాతర రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దీంతో నాలుగు రోజుల పాలు ములుగు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు, కార్యాలయాలకు సెలవులను ప్రకటించింది. మేడారం జాతర కోసం ఇప్పటికే అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లను పూర్తి చేశారు.
Next Story

