Thu Mar 19 2026 03:38:07 GMT+0530 (India Standard Time)
Ramoji Rao : అధికారిక లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు
ఈనాడు అధిపతి సంస్థల అధిపతి రామోజీరావు అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈనాడు అధిపతి సంస్థల అధిపతి రామోజీరావు అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే ఆయన పార్ధీవదేహానికి ఎప్పుడు అంత్యక్రియలు నిర్వహిస్తారన్నది కుటుంబ సభ్యులు నిర్ణయించనున్నారు.
విదేశాల్లో ఉన్న...
కుటుంబ సభ్యులు ఇంకా విదేశాల్లో ఉండటంతో వారు అందరూ హైదరాబాద్ చేరకున్న తర్వాతనే అంత్యక్రియలను నిర్వహించనున్నారు. ఆయనకు కుమారుడు, కోడలు, మనవడు, మనవరాళ్లు ఉన్నారు. వీరంతా వచ్చిన తర్వాతనే ఆయన అంత్యక్రియలను నిర్వహిస్తారు. ఫిలింసిటీలోనే ఆయన అంత్యక్రియలు జరుగుతాయి. ఆయన తాను ఇష్టపడి నిర్మించుకున్న చోటే ఆయన అంత్యక్రియలను నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.
Next Story

