Thu Mar 19 2026 16:27:55 GMT+0530 (India Standard Time)
Breaking : కేకేకు కేబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం
తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా కె.కేశవరావను ప్రభుత్వం నియమించింది

తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా కె.కేశవరావను ప్రభుత్వం నియమించింది. కేకేకు కేబినెట్ హోదాను కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల కె.కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు.
ప్రభుత్వ సలహాదారుగా...
అయితే రాజీనామా చేసిన రెండు రోజుల్లోనే కె.కేశవరావును నామినేటెడ్ పోస్టులో ప్రభుత్వం నియమించింది. ఆయన సుదీర్ఘకాలం కాంగ్రెస్ లో ఉండి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అయితే ప్రభుత్వం మారడంతో తిరిగి ఆయన కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు.
Next Story

