Sun Dec 08 2024 06:34:03 GMT+0000 (Coordinated Universal Time)
Telangana: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ గా బుర్రా వెంకటేశం
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ గా ప్రభుత్వం బుర్రా వెంకటేశాన్నినియమించారు
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ గా ప్రభుత్వం బుర్రా వెంకటేశాన్నినియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బుర్రా వెంకటేశానికి ఇంకా నాలుగేళ్ల సర్వీస్ ఉంది. బుర్రా వెంకటేశం నియామకాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా ఆమోదించారు.డిసెంబరు 2వ తేదీన బుర్రావెంకటేశం బాధ్యతలను స్వీకరించనున్నారు.
ప్రస్తుత ఛైర్మన్...
ప్రస్తుత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ గా ఉన్న మహేందర్ రెడ్డి పదవీ కాలం పూర్తి కావస్తుండటంతో బుర్రా వెంకటేశాన్ని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీనియర్ ఐఏఎస్ అధికారిగా పలు శాఖల్లో కీలక బాధ్యతలను పోషించిన బుర్రా వెంకటేశం రానున్న కాలంలో టీజీపీఎస్సీ ఛైర్మన్ గా వ్యవహరించనున్నారు.
Next Story