Mon Mar 16 2026 11:15:44 GMT+0530 (India Standard Time)
Telangana : గుడ్ న్యూస్.. మీ సెల్ ఫోన్ల మెసేజ్ లు చెక్ చేసుకోవచ్చు
తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 22వ తేదీన రైతు భరోసా నిధులను విడుదల చేయాలని ప్రభుత్వంనిర్ణయించింది. యాసంగిలో రైతులకు పెట్టుబడి సాయం కింద ఈ నిధులు అందచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు అధికారులను ఆదేశించారు. అయితే ఉగాదికి ముందే ఈ నిధులను విడుదల చేయాలని రేవంత్ రెడ్డి నిర్ణయించినా నిధుల సమీకరణ ఆలస్యం కావడంతో కొంత ఆలస్యంగా నిధులను విడుదల చేయనున్నారు. ఇందుకోసం నిధులను సమీకరించాలని, అవసరమైన నిధులను సిద్ధం చేసి పెట్టుకోవాలని కూడా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించినట్లు తెలిసింది.
ఎన్నికల్లో చెప్పినట్లుగానే...
తెలంగాణలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు కంటే ముందుగానే రైతు భరోసా నిధులను జమ చేయాలని, అందువల్ల రైతుల్లో నెలకొన్న అసంతృప్తిని తొలగించి పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల తరహాలో మాదిరిగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలని రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు తెలిసింది. ఇప్పటికే అధికారులకు దీనిపై ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్ ఎన్నికలు పూర్తయిన వెంటనే రైతు భరోసా నిధులు జమ చేస్తామని రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన నిజం చేసేలలా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. మొత్తం మూడు విడతల్లో నిధులను విడుదల చేయనున్నారు. తొలుత 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 3,590 కోట్ల నిధులను విడుదల చేయనున్నారు. మొత్తం మూడు విడతల్లో 9 వేల కోట్ల నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. సిద్ధిపేట జిల్లా నర్మెట్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధులను విడుదల చేయనున్నారు.
విడతల వారీగానే...
అయితే రైతు భరోసా నిధులను విడతల వారీగానే జమ చేయనున్నారు. రైతు భరోసా పథకం కింద, అర్హత కలిగిన రైతులు ఎకరానికి సీజన్‌కు 6,000 చొప్పున, రబీ మరియు ఖరీఫ్ పంట సీజన్లలో ఏటా ఎకరానికి రూ. 12,000 చొప్పున అందివ్వ నున్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల రిజిస్టర్డ్ బ్యాంకు ఖాతాలలో ఆర్థిక సహాయాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయనుంది. ఎకరం నుంచి మొదలు పెట్టి ఎన్ని ఎకరాలున్నప్పటికీ అందరికీ అందించేలా ఈ రైతు భరోసా నిధులు అందనున్నాయి. అయితే సాగు అయ్యే భూములకు మాత్రమే రైతు భరోసా నిధులు అందుతాయి.రైతులకు సాగులో పెట్టుబడి సాయం కోసం ఈ రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేయనుంది.
Next Story

