Sat Nov 08 2025 00:29:03 GMT+0000 (Coordinated Universal Time)
ఆదిలాబాద్ వాసులకు సర్కార్ గుడ్ న్యూస్
ఆదిలాబాద్ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆదిలాబాద్ లో విమానాశ్రయ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది

ఆదిలాబాద్ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆదిలాబాద్ లో విమానాశ్రయ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త ఎయిర్ పోర్టులను ఏర్పాటు చేయాలని భావించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుతో సమావేశమై ప్రతిపాదనలను సమర్పించారు.
కొత్త ఎయిర్ పోర్టు నిర్మాణానికి...
ఇందులో ఆదిలాబాద్ లో ఒక విమానాశ్రయాన్ని నిర్మించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. దిలాబాద్‌లో విమానాశ్రయ అభివృద్ధికి రాష్ట్ర సర్కార్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సమర్పించిన నివేదిక ఆధారంగా, ప్రభుత్వం ఆదిలాబాద్ కలెక్టర్‌ను భూసేకరణ ప్రారంభించాలని ఆదేశించింది. ఈ ప్రాజెక్ట్ ఉత్తర తెలంగాణలో కనెక్టివిటీని మెరుగుపరచడంతో పాటు పర్యాటకాన్ని, పారిశ్రామిక వృద్ధిని పెంచుతుందని అధికారులు తెలిపారు. విమానాశ్రయంలో మూడు కిలోమీటర్ల రన్‌వే, పౌర టెర్మినల్, భారత వైమానిక దళం స్టేషన్ ఉంటాయని చెబుతున్నారు.
Next Story

