Fri Dec 05 2025 14:33:02 GMT+0000 (Coordinated Universal Time)
Raja Singh : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
భారత రాజ్యాంగాన్ని మారుస్తానన్న కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు మార్చారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు

భారత రాజ్యాంగాన్ని మారుస్తానన్న కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు మార్చారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఆయన బీజేపీ కార్యాలయంలో జరిగిన అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలను గెలిపించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దళితులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా కేసీఆర్ నిలబెట్టుకోలేదని రాజాసింగ్ విమర్శించారు.
ఎక్కువ రోజులు...
అయితే తెలంగాణలో కాంగ్రెస్ ఎక్కువ రోజు అధికారంలో ఉండదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ చేసిన అప్పులను తీర్చడానికే కాంగ్రెస్ తన పాలన సమయాన్నంతా వెచ్చించాల్సి వస్తుందని కూడా అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు కూడా అమలయ్యే అవకాశాలు లేవని ఆయన అన్నారు.తెలంగాణ అభివృద్ధి ఒక్క బీజేపీతోనే సాధ్యమని తెలిపారు. ఏడాది తర్వాత తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రానుందని ఆయన జోస్యం చెప్పారు. ఇది వాస్తవమని ఆయన అన్నారు.
Next Story

