Tue Jan 20 2026 21:11:38 GMT+0000 (Coordinated Universal Time)
BJP : వైెఎస్ జగన్ ను విమర్శలతో ఉతికారేసిన బీజేపీ ఎమ్మెల్యే
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హాట్ కామెంట్స్ చేశారు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హాట్ కామెంట్స్ చేశారు. ఆయన ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను షేర్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి, చంద్రబాబు తిరుమలలో హిందూ ధర్మాన్ని రక్షించడానికి పాటుపడాలని కోరారు. గతంలో కన్వర్ట్ క్రిస్టియన్ జగన్ అధికారంలోకి రాగానే హిందూ ధర్మానికి తీవ్ర నష్టం చేశారని ఆరోపించారు. జగన్ అధికారంలోకి రాగానే ప్రాచీన దేవాలయాలను దెబ్బతీశారన్నారు.
తిరుమలలో...
తిరుమలలో అన్యమతస్తులకు ఉద్యోగాలు ఇవ్వడం, కన్వర్ట్ క్రిస్టియన్ ను టీటీడీ చైర్మన్ గా చేశారన్నారు. జగన్ హయాంలో తిరుమల పవిత్రతను దెబ్బతీశారని.. మాంసం, మందు కూడా కొడపైకి తరలించారని మండి పడ్డారు. ఏపీ ప్రజలు జగన్ పాలనలో ఆంధ్ర సురక్షితంగా ఉండదని భావించి ఓడించారన్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టగానే చంద్రబాబు తిరుమలలో అధర్మమైన పనులు చేస్తే సహించేది లేదని తేల్చిచెప్పారని గుర్తు చేశారు. తిరుమల తరహాలోనే శ్రీశైలంలో కూడా హిందూ ధర్మ వ్యతిరేకుల రాజ్యమేలుతున్నారన్నారు.
Next Story

