Thu Mar 19 2026 08:50:08 GMT+0530 (India Standard Time)
రాజాసింగ్కు నో ఎంట్రీ
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు కొత్త సచివాలయంలో చేదు అనుభవం ఎదురయింది

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు కొత్త సచివాలయంలో చేదు అనుభవం ఎదురయింది. రాజా సింగ్ ను సచివాలయంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదని ఆయనను వెనక్కు పంపారు. దీనిపై రాజాసింగ్ మండి పడ్డారు. మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ పిలిస్తేనే తాను వెళ్లానని రాజాసింగ్ చెప్పారు. మీటింగ్ రమ్మని ఆహ్వానిస్తేనే తాను సచివాలయానికి వెళ్లానని అన్నారు.
మీటింగ్ కోసం...
కానీ పోలీసులు అడ్డుకుని తన పట్ల అవమానకరంగా వ్యవహరించారన్నారు. ఇందుకు తనకు మనస్థాపం కలిగిందన్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ టైం పాస్ కోవడం మీటింగ్ పెట్టారా? అని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యేలకే అనుమతి లేకపోతే ఇంక ఎవరిని సచివాలయానికి అనుమతిస్తారని ఆయన ప్రశ్నించారు. నగరంలో ఉన్న ఎమ్మెల్యేలందరూ సమావేశానికి హాజరు కావాలని మెసేజ్ తలసాని పంపినా పోలీసులు అడ్డుకున్నారన్నారు.
Next Story

