Sun Mar 22 2026 10:05:26 GMT+0530 (India Standard Time)
రాజాసింగ్ కు ఊరట.. షరతులతో కూడిన బెయిల్
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు భారీ ఊరట లభించింది. హైకోర్టులో ఆయనకు బెయిల్ లభించింది

గోషామహల్ ఎమ్మెల్యే ఎమ్మెల్యేకు భారీ ఊరట లభించింది. హైకోర్టులో ఆయనకు బెయిల్ లభించింది. షరతులతో కూడిన బెయిల్ ఇస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. గత 57 రోజులుగా రాజాసింగ్ జైలులో ఉన్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, ఒక వర్గాన్ని కించపర్చే వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై ప్రభుత్వం పీడీ యాక్ట్ కూడా నమోదు చేసింది.
పీడీ యాక్ట్ ఎత్తివేస్తూ...
అయితే రాజాసింగ్ పై పీడీ యాక్ట్ ను ఎత్తివేస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. దీంతో ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఊరట లభించినట్లయింది. ఈ కేసుకు సంబంధించి రాజాసింగ్ ను బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. బయటకు వచ్చిన తర్వాత ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని హైకోర్టు రాజాసింగ్ కు షరతు విధించింది
Next Story

