Mon Feb 02 2026 02:21:20 GMT+0000 (Coordinated Universal Time)
డ్వాక్రా మహిళలకు శుభవార్త
తెలంగాణ రాష్ట్ర మహిళలకు శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్ర మహిళలకు శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. వడ్డీ లేని రుణాల కోసం డ్వాక్రా మహిళలు ఎదురుచూస్తూ ఉన్న సంగతి తెలిసిందే. డ్వాక్రా మహిళలకు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుభవార్త చెప్పారు. త్వరలో డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. మధిర మండలం రొంపిమల్ల రోడ్డు శంకుస్థాపన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని.. త్వరలో డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు మంజూరు చేస్తామన్నారు.
దెబ్బతిన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతున్నామని.. ఉద్యోగులందరికీ 1వ తేదీనే జీతాలు ఇస్తున్నామని అన్నారు భట్టి విక్రమార్క. అస్తవ్యస్తంగా మారిన టీఎస్ పీఎస్ సీ ని ప్రక్షాళన చేశామని.. కేవలం 3 నెలల్లోనే 25 వేల మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామని భట్టి విక్రమార్క తెలిపారు. 119 నియోజకవర్గాల్లో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలన్నింటిని భర్తీ చేస్తామని.. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా పూర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.
Next Story

