Sat Mar 07 2026 15:39:52 GMT+0530 (India Standard Time)
గుడ్ న్యూస్: తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ డేట్ వచ్చేసింది
TSPSC తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ తేదీని ప్రకటించింది

TSPSC తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ తేదీని ప్రకటించింది. జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి 19న 563 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 23 నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. మార్చి 14న సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. గత నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్నవాళ్లు కూడా ఇప్పుడు అప్లయ్ చేసుకోవచ్చు. అయితే ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు.
కొత్త అభ్యర్థులకు అప్లికేషన్ ప్రాసెస్ ఫీజు రూ.200, ఎగ్జామినేషన్ ఫీజు రూ.120 ఉంటుంది. నిరుద్యోగులకు ఎగ్జామినేషన్ ఫీజు (రూ.120) నుంచి మినహాయింపు ఉంటుంది. దరఖాస్తు చేసే సమయంలోనే రీఅప్లై, ఫ్రెష్ అనే వాటిని ఎంచుకొని అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ మార్చి 23 ఉదయం 10 గంటల నుంచి మార్చి 27వ తేదీ సాయంత్రం 4గంటల వరకు ఉంటుంది.
Next Story

