Fri Dec 19 2025 02:29:06 GMT+0000 (Coordinated Universal Time)
Telagnana : తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. విద్యుత్తు ఛార్జీలు పెరగవ్
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ అందింది. ఈ ఆర్థిక సంవత్సరం విద్యుత్తు ఛార్జీలు పెంపుదల లేదని రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి తెలిపింది

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ అందింది. ఈ ఆర్థిక సంవత్సరం విద్యుత్తు ఛార్జీలు పెంపుదల లేదని రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి తెలిపింది. 2025 -26 సంవత్సరానికి పాతపద్ధతిలోనే ఛార్జీలు వసూలు చేయాలని విద్యుత్తు నియంత్రణ మండలి చెప్పడంతో ఈ ఏడాది ఇక తెలంగాణలో విద్యుత్తు భారం ప్రజలపై పడే అవకాశం లేనట్లే.
విద్యుత్తు నియంత్రణ మండలి...
విద్యుత్తు నియంత్రణ మండలి ఉత్తర్వులు మే 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. విద్యుత్తు వాడకం పెరగడంతో పాటు అనేక ప్రాంతాల నుంచి విద్యుత్తును కొనుగోలు చేయాల్సి రావడంతో ధరలు పెరుగుతాయని అందరూ భావించారు. కానీ ఊహించని విధంగా విద్యుత్తు నియంత్రణ మండలి విద్యుత్తు ఛార్జీలను పెంచమని తెలపడంతో తీపికబురుగానే చూడాలి.
Next Story

