Fri Dec 05 2025 10:29:19 GMT+0000 (Coordinated Universal Time)
ప్రముఖులకు గోమయ ప్రతిమలను అందజేసిన అల్లోల దివ్యారెడ్డి
మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత ఎంపీ సంతోష్ కుమార్ ను సేవ్ దేశీ కౌస్ క్యాంపెనర్, క్లిమామ్ వ్యవస్థాపకురాలు

మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత ఎంపీ సంతోష్ కుమార్ ను సేవ్ దేశీ కౌస్ క్యాంపెనర్, క్లిమామ్ వ్యవస్థాపకురాలు అల్లోల దివ్యారెడ్డి కలిసారు. ఈ సందర్భంగా వారికి ఆమె గోమయ గణపతి ప్రతిమను అందజేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎకో ప్రెండ్లీ గోమయ గణపతి ప్రతిమల తయారీ, పంపిణీ, దేశవాళీ ఆవుల సంరక్షణ కోసం చేపట్టిన ప్రచార కార్యక్రమాలను వారికి వివరించారు.
పూర్వకాలంలో వినాయక చవితికి మనం స్వయంగా చిన్న చిన్న విగ్రహాలను మట్టితో లేక పవిత్రమయిన గోమయంతో చేసి, పదకొండు రోజులు భక్తి శ్రద్ధలతో పూజించుకుని నిమజ్జనం చేసేవాళ్ళం. ఇప్పుడు వినాయక చవితి అంటే పెద్ద పెద్ద ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు, వాటిని చెరువుల్లో నిమజ్జనం చేయడమే గుర్తొస్తుంది. అలా చేయడం వలన పర్యావరణానికి హాని కలిగించడమే కాకుండా, మన ముందు తరాలవారికి మన పండుగల పవిత్రతను చెప్పలేకపోతున్నామని అన్నారు దివ్యా రెడ్డి.
అంతరించిపోయిన గోమయ గణపతుల తయారీ కళని క్లిమోమ్ ద్వారా తిరిగి తీసుకువచ్చి 2016 నుంచి గత 8 సంవత్సరాలుగా గోమయ గణపతులని చేసి ఐకేఆర్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా పంచుతున్నట్లు తెలిపారు. 30 మంది కళాకారులు ఆరు నెలలుగా శ్రమించి క్లిమామ్ గోశాలలో ఈ గోమయ గణపతులను తయారు చేశారని తెలిపారు. గోమయ గణపతులను తయారు చేయడానికి గోమయం, పసుపు, మట్టి, చింతగింజల మిశ్రమం, వేపాకు మిశ్రమం, ఎండు గడ్డి వంటి సహజమైన పదార్థాలనే ఉపయోగిస్తున్నారన్నారు. పర్యావరణహితంగా ప్రకృతికి ఎటువంటి హాని కలిగించని గోమయ లేదా మట్టి గణపతులనే వాడాలని అల్లోల దివ్యా రెడ్డి పిలుపునిచ్చారు.
Next Story

