Sun Mar 22 2026 01:33:50 GMT+0530 (India Standard Time)
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు
బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. రెండు మూడు రోజుల నుంచి స్థిరంగా ఉన్న బంగారం ధరలు పెరగడం ఆశ్చర్యకరమేమీ కాదు.

బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. రెండు మూడు రోజుల నుంచి స్థిరంగా ఉన్న బంగారం ధరలు పెరగడం ఆశ్చర్యకరమేమీ కాదు. బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతూనే ఉన్నారు. కరోనా థర్డ్ వేవ్ పొంచి ఉందని, బంగారం ధరలు మరింత పెరుగుతాయని అంటున్నారు. అయితే ఈరోజు స్వల్పంగా మాత్రమే బంగారం ధరలు పెరిగాయి. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశముంటుందని నిపుణలు చెబుతున్నారు. ఈ ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశముంది.
హైదరాబాద్ లో...
హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 44,950 రూపాయలు ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 49,040 రూపాయలుగా ఉంది. రానున్నది పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఈ ధరలు మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు.
Next Story

