Sat Apr 04 2026 02:31:47 GMT+0530 (India Standard Time)
బంగారం ధర మరింత పెరగనుందా?
బంగారం ధరలు మళ్లీ పెరిగే అవకాశముంది. పెళ్లిళ్ల సీజన్ లో బంగారం కొనుగోళ్లు, అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి.

వచ్చేది పెళ్లిళ్ల సీజన్. దీంతో బంగారం ధరలు మళ్లీ పెరిగే అవకాశముంది. పెళ్లిళ్ల సీజన్ లో బంగారం కొనుగోళ్లు, అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ సీజన్ లో బంగారం ధరలు పెరుగుతూ ఉంటాయి. నేడు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. కొన్ని నగరాల్లో బంగారం ధరలు పెరగగా, మరికొన్ని నగరాల్లో స్వల్పంగా తగ్గాయి. బంగారాన్ని ఇప్పుడే కొనుగోలు చేయడం మంచిదని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. రానున్న కాలంలో మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు.
నేటి ధరలు....
హైదారాబాద్ మార్కెట్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 45,740 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 49,900లుగా ఉంది. హైదరాబాద్ లో స్వల్పంగా తగ్గాయి. కిలో వెండి 70,400లుగా ఉంది.
Next Story

