Sun Mar 15 2026 06:31:30 GMT+0530 (India Standard Time)
పెరుగుతున్న గోదావరి.. మొదటి ప్రమాద హెచ్చరిక
గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. ఎగువన కరుస్తున్న వర్షాలతో గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తుంది.

గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. ఎగువన కరుస్తున్న వర్షాలతో గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తుంది. భద్రాచలం వద్ద యాభై అడుగుల కు నీటి మట్టం చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద 12,51,999 క్యూసెక్కుల ప్రవాహం సాగుతుందని నీటి పారుదల శాఖ అధికారులు చెప్పారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలను....
భద్రాచలం ఆలయ స్నానఘట్టాలు గోదావరి నీటిలో మునిగాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులను అప్రమత్తం చేశారు. ముంపునకు గురయ్యే ప్రాంతాలను ముందుగానే గుర్తించి వీలయితే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.
Next Story

