Sun Mar 08 2026 03:50:47 GMT+0530 (India Standard Time)
సీఎం ఇంటికి గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు

గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ఆయనను కలసి కాసేపు ముచ్చటించారు. దీంతో ఆయన కాంగ్రెస్ లో కొనసాగే అవకాశముందన్న చర్చ జరుగుతుంది. నిన్న బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని మంత్రి జూపల్లి కృష్ణారావు కలసి చర్చలు జరిపిన నేపథ్యంలో నేడు సీఎంను కలసి ఆయనతో బ్రేక్ ఫాస్ట్ చేశారు.
బీఆర్ఎస్ లో చేరతారని...
గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ లో గెలిచి కొంత కాలం క్రితం కాంగ్రెస్ లో చేరారు. అయితే ఇటీవల ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తిరిగి ఆయన బీఆర్ఎస్ లోకి వెళతారన్న ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో మరోసారి ముఖ్యమంత్రిని కలవడంతో ఆయన కాంగ్రెస్ లో కొనసాగేందుకు అంగీకరించినట్లు తెలిసింది.
Next Story

