Wed Jan 21 2026 09:08:44 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : బీఆర్ఎస్ కు షాక్.. మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ లోకి జంప్
గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరనున్నారు

బీఆర్ఎస్ కు వరస షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేేరిన సంగతి తెలిసిందే. తాజాగా గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరనున్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఆయనతో పాటు ఆయన ముఖ్య అనుచరులు కూడా సీఎం ఇంటికి వచ్చారు.
స్థానిక నేతల అభ్యంతరాలను...
గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి పార్టీలో చేరికపై అక్కడి కాంగ్రెస్ నేతల అభ్యంతరాలను పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదు. కాంగ్రెస్ ఇన్ఛార్జి సరితను సముదాయించాలని అగ్రనేతలు ప్రయత్నిస్తున్నారు. కానీ అధినాయకత్వం సూచన మేరకు ఎమ్మెల్యే చేరికకు మార్గం సుగమమయింది. కృష్ణ మోహన్ రెడ్డి పార్టీ మారతారని ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రచారానికి నేటితో తెరపడనుంది.
Next Story

