Sun Mar 15 2026 10:44:05 GMT+0530 (India Standard Time)
కేసీఆర్ మీద పోటీకి సిద్ధం : గద్దర్
ప్రజా గాయకుడు గద్దర్ సంచలన నిర్ణయం ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు తెలిపారు.

ప్రజా గాయకుడు గద్దర్ సంచలన నిర్ణయం ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు తెలిపారు. తాను ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్టు తెలిపారు. మెదక్ జిల్లా తూప్రాన్‌లో పోలీసులను కలిసిన గద్దర్ తనకు రక్షణ కల్పించాలని కోరారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
సొంత ఊరిపై...
తన వయసు 76 సంవత్సరాలని, ఇక నుంచి పుట్టిన ఊళ్లోనే జీవించాలని అనుకుంటున్నట్టు గద్దర్ ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. తమ గ్రామంపై మై విలేజ్ ఆఫ్ ది 60 ఇయర్స్ పేరుతో పుస్తకం రాసినట్టు గద్దర్ తెలిపారు. రానున్న ఎన్నికలతో తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెడుతున్నట్టు వివరించారు. ప్రజలు ఆశీర్వదిస్తారా? లేదా? అన్నది పక్కన పెట్టి తాను పోటీలో ఉంటానని గద్దర్ ప్రకటించారు.
Next Story

