Thu Jan 29 2026 03:02:07 GMT+0000 (Coordinated Universal Time)
Telangana Speaker : స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల గడువు ముగిసింది.

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల గడువు ముగిసింది. సాయంత్రం ఐదు గంటల వరకూ స్పీకర్ పదవికి గడ్డం ప్రసాదరావు ఒక్కరే నామినేషన్ వేశారు. దీంతో రేపు సభలో గడ్డం ప్రసాదరావు స్పీకర్ గా ఎన్నికయినట్లు అధికారికంగా ప్రకటించనున్నారు.
బీఆర్ఎస్ మద్దతివ్వడంతో...
స్పీకర్ ఎన్నికకు ప్రతిపక్ష బీఆర్ఎస్ మద్దతు ప్రకటించడంతో ఎన్నిక ఏకగ్రీవానికి మార్గం సుగమమయింది. రేపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా స్పీకర్ గా గడ్డం ప్రసాదరావు బాధ్యతలను చేపడతారు. తెలంగాణ రాష్ట్రానికి తొలి దళిత స్పీకర్ గా గడ్డం ప్రసాదరావు ఎన్నికయినట్లే. దీంతో నేతలు ఆయనకు శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నారు.
Next Story

