Wed Mar 25 2026 07:24:45 GMT+0530 (India Standard Time)
Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ బిజీ బిజీ
తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీ బిజీగా గడుపుతున్నారు

తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీ బిజీగా గడుపుతున్నారు. అగ్రనేతలను కలసి తనను సీఎల్పీ నేతగా ఎన్నికయ్యేలా సహకరించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్న రేవంత్ రెడ్డి డీకే శివకుమార్ తో భేటీ అయి మంత్రి వర్గ కూర్పుపై చర్చించినట్లు తెలిసింది.
అగ్రనేతలను కలసి...
ఈరోజు ఢిల్లీలో కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేలను కలిసి తన ప్రమాణ స్వీకారానికి రావాలని కోరారు. తాజాగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను కలసి ప్రమాణస్వీకారానికి రావాలని ఆహ్వానించనున్నారు. రేపు ఆయన తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
Next Story

