Sat Mar 07 2026 21:02:13 GMT+0530 (India Standard Time)
Revanth Reddy : సీఎం కాబోయే ముందు రేవంత్ లేఖ
తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు బహిరంగ లేఖ రాశారు.

తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఇందిరమ్మ రాజ్యం రేపటి నుంచి ప్రారంభం కాబోతుందన్నారు. అమరుల త్యాగం, విద్యార్థుల పోరాటం, సోనియా గాంధీ సంకల్పంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అందరి ఆకాంక్షలు నెరవేరే సమయం దగ్గరలోనే ఉందని ఆయన లేఖలో పేర్కొన్నారు. బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు, మహిళలు, యువత, రైతులు, రైతు కూలీలు, యువత అందరూ రేపటి ప్రమాణస్వీకారానికి హాజరు కావాలని ఆయన కోరారు.
అందరూ రావాలంటూ...
రేపు మధ్యాహ్నం ఎల్.బి. స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుందని అందరూ రావాలని రేవంత్ రెడ్డి తన లేఖ ద్వారా ప్రజలకు పిలుపు నిచ్చారు. ప్రజాస్వామ్య యుతంగా, పారదర్శక పాలన అందించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. తమకు ఇంతటి విజయాన్ని కట్టబెట్టిన తెలంగాణ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అందరి ఆకాంక్షలు నెరవేరే రోజున జరిగే ప్రమాణ స్వీకారానికి అందరూ హాజరై కొత్త ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని రేవంత్ రెడ్డి కోరారు.
Next Story

