Thu Mar 19 2026 03:37:00 GMT+0530 (India Standard Time)
Ramoji Rao : రేపు ఉదయం ఫిలింసిటీలో అంత్యక్రియలు
ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావు అంత్యక్రియలు రేపు ఉదయం జరగనున్నాయి

ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావు అంత్యక్రియలు రేపు ఉదయం జరగనున్నాయి. ఉదయం 9 గంటలకు రామోజీ ఫిలింసిటీలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.
ఆయన లేని లోటు...
ఫిలింసిటీలో ఉన్న రామోజీరావు పార్ధీవదేహాన్ని పలువురు ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు. మీడియారంగంలో విశేష కృషి చేసిన రామోజీరావు మృతి పత్రికారంగానికే కాదు అనేక రంగాలకు తీరని లోటని ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డి అన్నారు. రామోజీ కుటుంబంతో తనకు సన్నిహిత సంబంధాలను రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
Next Story

