Thu Mar 19 2026 00:47:49 GMT+0530 (India Standard Time)
Ramoji Rao : మరికాసేపట్లో రామోజీ రావు అంతిమ సంస్కారాలు
ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. ఫిలింసిటీలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు

ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. ఫిలింసిటీలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అధికారిక లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన తాను మరణించిన తర్వాత ఎక్కడ అంత్యక్రియలు చేయాలో ముందే నిర్వహించుకున్నారు. స్మారక కట్డడాన్ని కూడా నిర్మించుకున్నారు.
భారీ భద్రత...
ఆ స్మృతి కట్టడం వద్దనే నేడు అంత్యక్రియలు జరగనున్నాయి. తాను చనిపోయిన తర్వాత ముందుగానే నిర్మించుకున్న స్మారక స్మృతివనం ప్రాంతంలో ఏర్పాట్లు చేస్తున్నారు. రామోజీ ఫిలింసిటీలో భద్రత ఏర్పాట్లను పోలీసులు పరిశీలిస్తున్నారు. రామోజీరావు అంతిమ సంస్కారాలకు వీవీఐపీలు హాజరవుతుండటంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేశారు.
Next Story

