Sun Feb 09 2025 19:51:36 GMT+0000 (Coordinated Universal Time)
రేపటి నుంచి తెలంగాణలో బూస్టర్ డోస్
రేపటి నుంచి తెలంగాణలో అరవై ఏళ్లు దాటిన వారికి బూస్టర్ డోస్ వేయనున్నారు

రేపటి నుంచి తెలంగాణలో అరవై ఏళ్లు దాటిన వారికి బూస్టర్ డోస్ వేయనున్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్, హెల్త్ కేర్ వర్కర్లకు కూడా రేపటి నుంచి బూస్టర్ డోస్ వేస్తారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. కరోనా వైరస్ వల్ల ఎవరూ భయపడాల్సిన పని లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.
సంక్రాంతి పండగను....
ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మాస్క్ ధరిస్తూ, కోవిడ్ నిబంధనలను పాటిస్తే కరోనాను తరమికొట్టడం పెద్ద కష్టమేమీ కాదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఖచ్చితంగా అందరూ వ్యాక్సినేషన్ చేయించుకోవాలని ఆయన కోరారు. అలాగే సంక్రాంతి పండగను కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ , జాగ్రత్తలు పాటిస్తూ జరుపుకోవాలని కేసీఆర్ కోరారు.
Next Story