Thu Mar 19 2026 15:03:21 GMT+0530 (India Standard Time)
నేటి నుంచి వారికి రైతుబంధు
నేటి నుంచి తెలంగాణ లో రైతు బంధు పథకం కింద ఐదు ఎకరాలు పైన ఉన్నవారికి నగదును అందచేస్తారు

నేటి నుంచి తెలంగాణ లో రైతు బంధు పథకం కింద ఐదు ఎకరాలు పైన ఉన్నవారికి నగదును అందచేస్తారు. వారి ఖాతాల్లో జమ చేస్తారు. ఇప్పటి వరకూ నాలుగు ఎకరాల వరకూ ఉన్న 51.99 లక్షల మంది రైతులకు రైతు బంధు పథకం కింద 3,946 కోట్ల రూపాయలను విడుదల చేశారు. ఇప్పటికే 78,93,413 ఎకరాలకు సంబంధించి రైతులకు రైతు బంధు పథకం కింద వారి ఖాతాల్లో నిధులు జమ అయ్యాయి.
ఐదు ఎకరాలకు పైబడి...
నేటి నుంచి ఐదు ఎకరాలకు పైబడి ఉన్న వారి ఖాతాల్లో నగదును అధికారులు జమ చేయనున్నారని ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ప్రతి ఎకరాకు రైతు బంధు పథకం కింద పదివేల రూపాయల పెట్టుబడి సాయాన్ని తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంగతి తెలిసిందే.
Next Story

