Sun Mar 15 2026 11:33:44 GMT+0530 (India Standard Time)
ఒక్క నెలలోనే 3,350 కోట్ల మద్యాన్ని చప్పరించేశారు
డిసెంబరు 1 నుంచి 31 వతేదీ వరకూ తెలంగాణలో 3,350 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది.

ఒక్క నెలలో తెలంగాణలో మందుబాబులు తాగింది ఎంతో తెలుసా? 3,350 కోట్ల మద్యాన్ని చప్పరించేశారు. డిసెంబరు 1 నుంచి 31 వతేదీ వరకూ తెలంగాణలో 3,350 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఈరోజు వరకూ 34 లక్షల కేసుల బీర్లు, నలభై లక్షల కేసుల మద్యం అమ్మకాలు జరిగినట్లు తెలిపింది.
న్యూ ఇయర్....
అయితే ఒక నెలలో ఇంత స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగిన దాఖలాలు లేవని, ఇది ఒక రికార్డు అని ఎక్సైజ్ శాఖ తెలిపింది. వరసగా ఈ నెలలో పండగలు, న్యూఇయర్ వేడుకలు రావడంతో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయని ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు.
Next Story

