Tue Mar 24 2026 11:17:12 GMT+0530 (India Standard Time)
కేసీఆర్కు యంగ్ లియూ లేఖ
ఫాక్స్కాన్ ఛైర్మన్ యంగ్ లియూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. కొంగరకలాన్ లో పరిశ్రమను ఏర్పాటు చేస్తామన్నారు

ఫాక్స్కాన్ ఛైర్మన్ యంగ్ లియూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. తాము కొంగరకలాన్ లో పరిశ్రమను ఏర్పాటు చేస్తామని తెలిపారు. అందుకు ప్రభుత్వం నుంచి తగిన సహకారం కావాలని యంగ్ లియూ కేసీఆర్ కు రాసిన లేఖలో కోరారు. త్వరలోనే కొంగరకలాన్ ఎలక్ట్రానిక్ పార్క్ ను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఎలక్ట్రానిక్ పార్క్ ఏర్పాటు...
ఈ సందర్భంగా తైవాన్ కు రావాలంటూ కేసీఆర్ కు ఆహ్వానం యంగ్ లియూ పంపారు. తనకు ఇక్కడ లభించిన ఆతిధ్యాన్ని తాను మరువలేనని ఆయన తెలిపారు. వీలయినంత త్వరలోనే పార్కును ఏర్పాటు చేస్తామని తెలిపారు. పార్క్ ఏర్పాటుకు మీ సహకారం కావాలంటూ కేసీఆర్ ను లేఖలో యంగ్ లీయూ కోరారు.
Next Story

