Fri Dec 05 2025 12:26:17 GMT+0000 (Coordinated Universal Time)
Sangareddy : సిగాచీ పరిశ్రమలో పేలుడు ఘటనలో పథ్నాలుగుకు పెరిగిన మృతుల సంఖ్య
సంగారెడ్డి జిల్లా పాశమైలారం రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలిన ఘటనలో పథ్నాలుగు మంది మరణించారు

సంగారెడ్డి జిల్లా పాశమైలారం రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలిన ఘటనలో పథ్నాలుగు మంది మరణించారు. మరో 26 మందికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల్లో సిగాచీ కంపెనీ మేనేజర్ కూడా ఉన్నారు. వీరిలో పన్నెండు మంది పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. సిగాచి రసాయన పరిశ్రమలో ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇంకా కొందరు కార్మికులు భవనాల శిధిలాల కింద చిక్కుకుని ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఉదయం 9.30 గంటల ప్రాంతలో ఈ ప్రమాదం జరగ్గా వెంటనే అగ్నిమాపకసిబ్బంది తో పాటు అన్నిశాఖల అధికారులు వచ్చి సహాయక చర్యలుప్రారంభించారు. అయితే ప్రమాదం జరగడానికి గల కారణాలను కూడా పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కుటుంబ సభ్యుల ఆందోళన...
మరొక వైపు సిగాచి పరిశ్రమవద్ద ఉద్రిక్తత నెలకొంది. పరిశ్రమ లోపలికి వెళ్లేందుకు కార్మికుల కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. కానీ పోలీసులు ఎవరిని వెళ్లనివ్వడంలేదు. తమ వారి ఆచూకీ చెప్పాలని వారు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గాయపడిన వారిని ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలోమొత్తం 108మంది కార్మికులు విధుల్లో ఉన్నట్లు అక్కడ సిబ్బంది చెబుతున్నారు. ఇంకా కొందరిమంది పరిశ్రమలోపల చిక్కుకుపోయి ఉన్నారు. సిగాచీ రసాయన పరిశ్రమలో రాయాక్టర్ ఒక్కసారిగా పేలడంతో దాదాపు ఐదు నుంచి ఆరు కిలోమీటర్ల వరకూ పేలుడు శబ్దం వినిపించింది.
మరో పన్నెండుమంది పరిస్థితి ఆందోళనకరం...
పరిశ్రమలో జరిగిన పేలుడు కారణంగా అక్కడికక్కడే ఐదుగురు మరణించగా మరో తొమ్మిదిమంది గాయపడి ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మరణించారని అధికారులు తెలిపారు. పేలుడు ధాటికి వంద మీటర్ల దూరంలో కార్మికులు పడిపోయారు. రియాక్టర్ ఉన్న భవనం కూడా కూలిపోవడంతో పెద్ద ప్రమాదమే సంభవించింది. మృతదేహాలన్నీకాలిపోవడంతో గుర్తించేందుకు ఫోరెన్సిక్ నిపుణులు ఆసుపత్రికి చేరుకున్నారు. మార్చురీకి చేరుకున్న ఫోరెన్సిక్ నిపుణులు మృతదేహాలను గుర్తించే పనిలో పడ్డారు. మృతులు ఎక్కువ మంది ఒడిశా,బీహార్ కు చెందిన కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారందరికీ మెరుగైన వైద్య సౌకర్యాన్ని అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. మంత్రుల బృందం కూడా ఘటన స్థలాన్నిపరిశీలించింది. ప్రభుత్వం కార్మికుల కుటుంబాలను ఆదుకుంటుందని చెప్పారు.
Next Story

