Thu Mar 19 2026 10:58:48 GMT+0530 (India Standard Time)
కాసానికి కండువా కప్పిన కేసీఆర్
తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ లో చేరారు.

తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ లో చేరారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఆయన కేసీఆర్ సమక్షంలో పార్టీ కండువాను కప్పుకున్నారు. కాసాని జ్ఞానేశ్వర్ ను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ తగిన గుర్తింపు ఇస్తుందని ఈ సందర్భంగా కేసీఆర్ కాసాని జ్ఞానేశ్వర్ కు హామీ ఇచ్చినట్లు తెలిసింది.
టీడీపీ నుంచి....
కాసాని జ్ఞానేశ్వర్ మొన్నటి వరకూ తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన తెలంగాణ ఎన్నికలలో పోటీ చేసేందుకు అభ్యర్థులను కూడా సిద్ధం చేశారు. అయితే పోటీకి చంద్రబాబు అంగీకరించకపోవడంతో పార్టీకి రాజీనామా చేశారు. తర్వాత తన ముఖ్యమైన అనుచరులతో చర్చించి బీఆర్ఎస్ లో చేరిపోయారు.
Next Story

