Wed Dec 17 2025 14:13:31 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ మాజీ ఎమ్మెల్యే మృతి
తెలంగాణలో మాజీ శాసనసభ్యులు బానోత్ మదన్ లాల్ మృతి చెందారు

తెలంగాణలో మాజీ శాసనసభ్యులు బానోత్ మదన్ లాల్ మృతి చెందారు. వైరాకు చెందిన బానోత్ మదన్ లాల్ గుండెపోటుతో మరణించారు. బానోత్ మదన్ లాల్ గుండెపోటులో ఏజీఎం ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ మరణించారు. ఆయన 2024 ఎన్నికల్లో వైరా నియోజకవర్గం నుంచి విజయం సాధించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
వైరా నియోజకవర్గం నుంచి...
2014 లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలలో బానోత్ మదన్ లాల్ వైసీపీ నుంచి వైరా నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. బానోత్ మదన్ లాల్ మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు సంతాపాన్ని ప్రకటించారు. వారి కుటుంబానికి సానుభూతిని తెలియజేశారు. కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Next Story

