Mon Mar 16 2026 07:54:12 GMT+0530 (India Standard Time)
BRS : కుప్పకూలిన మాజీ హోం మంత్రి.. జెండా ఎగురవేస్తుండగా
తెలంగాణ మాజీ హోం మంత్రి మహమూద్ ఆలీ కుప్పకూలి పడిపోయారు

తెలంగాణ మాజీ హోం మంత్రి మహమూద్ ఆలీ కుప్పకూలి పడిపోయారు. రిపబ్లిక్ డే దినోత్సవం సందర్భంగా జెండా ఎగురవేస్తూ ఆయన కుప్పకూలి పడిపోయారు. వెంటనే ఆయనకు ప్రాధమిక చికిత్సను అందించిన అనంతరం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి.
తీవ్ర అనారోగ్యానికి గురై...
మహమ్మద్ ఆలీ తీవ్ర అనారోగ్యానికి గురై కుప్పకూలి పడిపోవడంతో అక్కడ ఉన్న వారు అవాక్కయ్యారు. వెంటనే ఆయన భద్రత సిబ్బంది ఆయనకు ప్రాధమిక చికిత్స చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ భవన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆయన కోలుకుంటున్నారని చెబుతున్నారు.
Next Story

