Sun Mar 15 2026 19:58:47 GMT+0530 (India Standard Time)
బీజేపీలో చేరిన దాసోజు శ్రవణ్
తెలంగాణ మాజీ కాంగ్రెస్ నేత దాసోజు శ్రావణ్ బీజేపీలో చేరారు. ఆయన కొద్దిసేపటి క్రితం బీజేపీలో చేరారు

తెలంగాణ మాజీ కాంగ్రెస్ నేత దాసోజు శ్రావణ్ బీజేపీలో చేరారు. ఆయన కొద్దిసేపటి క్రితం బీజేపీలో చేరారు. తెలంగాణ ఇన్ఛార్జి తరుణ్ చుగ్ సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కాంగ్రెస్ కు రాజీనామా చేసి....
రెండు రోజుల క్రితం దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. నిన్ననే బండి సంజయ్ తో కలిసి ఆయన ఢిల్లీకి వెళ్లారు. ఈరోజు బీజేపీ పెద్దల సమక్షంలో పార్టీలో చేరిపోయారు. పార్టీ బలోపేతానికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా దాసోజు శ్రవణ్ తెలిపారు.
Next Story

