Sun Mar 08 2026 09:00:32 GMT+0530 (India Standard Time)
KCR : చాలా రోజుల తర్వాత రేపు నేతల ఎదుటకు కేసీఆర్
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు నేతలతో సమావేశం కానున్నారు

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు నేతలతో సమావేశం కానున్నారు. ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ పార్లమెంటరీ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కేసీఆర్ పాల్గొంటారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ కు చెందిన పార్లమెంటు సభ్యులు హాజరు కావాలని ఇప్పటికే పార్టీ నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఈ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీశ్‌రావులు హాజరు కానున్నారు.
బడ్జెట్ సమావేశాలు...
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరుతున్న నేపథ్యంలో కేసీఆర్ పార్లమెంటరీ సమావేశం రేపు నిర్వహించనున్నారు. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు ఆయన ఉభయ సభల్లో వ్యవహరించాల్సిన విషయాలపై దిశానిర్దేశం చేయనున్నారు. కేసీఆర్ కు కాలు యాక్సిడెంట్ అయిన తర్వాత నేతలతో తొలి సారి భేటీ కానుండటంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.
Next Story

