Fri Dec 05 2025 14:55:24 GMT+0000 (Coordinated Universal Time)
నేడు సిట్ ఎదుటకు ప్రభాకర్ రావు
తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు స్పెషల్ ఇన్విస్టిగేషన టీం ఎదుట మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు హాజరు కానున్నారు

తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు స్పెషల్ ఇన్విస్టిగేషన టీం ఎదుట మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు హాజరు కానున్నారు. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావును సిట్ మరోసారి విచారించనుంది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఈ విచారణ జరగనుంది. ఇప్పటికే ప్రభాకర్ రావును అనేక సార్లు విచారించింది.
వాంగ్మూలం ఆధారంగా...
ఆయన ఫోన్లు, ల్లాప్ ట్యాప్ లను కూడా సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ఫోన్ ట్యాపింగ్ కు గురయిన ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి కూడా సిట్ ముందు వాంగ్మూలం ఇచ్చే అవకాశముంది. ఈ వాంగ్మూలం ఆధారంగా ప్రభాకర్ రావును సిట్ అధికారులు ప్రశ్నించే అవకాశముంది. ఇప్పటి వరకూ అనేక మంది నుంచి సేకరించిన ఆధారాల మేరకు ప్రభాకర్ రావును నేడుమరోసారి ప్రశ్నించనుంది.
Next Story

