Thu Mar 26 2026 04:26:56 GMT+0530 (India Standard Time)
కేసీఆర్ కు దేవెగౌడ ఫోన్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాజీ ప్రధాని దేవెగౌడ ఫోన్ చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాజీ ప్రధాని దేవెగౌడ ఫోన్ చేశారు. కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేయాలని భావిస్తున్న కూటమికి తన మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు. కేసీఆర్ రాజకీయంగా తీసుకునే నిర్ణయానికి తమ మద్దతు ఉంటుందని చెప్పారు.
జాతీయ పార్టీలతో...
జాతీయ పార్టీలతో దేశం పూర్తిగా వెనకబడి పోయిందని, ప్రాంతాల సమతౌల్యత దెబ్బతింటుందని ఈ సందర్బంగా దేవెగౌడ అభిప్రాయపడ్డారు. రాష్ట్రాల హక్కులు పరిరక్షించుకోవాలనుకున్నా తృతీయ ఫ్రంట్ ఏర్పాటు అవసరమని ఆయన అభిప్రాయపడి నట్లు తెలుస్తోంది. కేసీఆర్ కు ఇప్పటికే మమత బెనర్జీ ఫోన్ చేసి మద్దతు పలికిన సంగతి తెలిసిందే.
- Tags
- deve gowda
- kcr
Next Story

