Fri Dec 05 2025 11:28:25 GMT+0000 (Coordinated Universal Time)
Kasani Jnaneswar : కారు పార్టీలోకి కాసాని
తెలంగాణ టీడీపీ మాజీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ లో చేరనున్నారు

తెలంగాణ టీడీపీ మాజీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ లో చేరనున్నారు. రేపు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఆయన కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. తెలంగాణలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో పోటీ చేయకూడదని చంద్రబాబు నిర్ణయించిన తర్వాత ఆ పార్టీ అధ్యక్ష పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి కూడా కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
రేపు చేరిక...
అయితే ఆయన తన అనుచరులతో సమావేశమై బీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆయన రేపు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో పార్టీలో చేరడానికి అన్ని సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఈ ఎన్నికలలో ఆయన పోటీకి కూడా సిద్ధమవుతున్నారని తెలిసింది. గోషామహల్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ను బరిలోకి దించుతారన్న ప్రచారం జరుగుతుంది.
Next Story

